ఇదెంత ఘోర‌మంటే…సినిమాని త‌ల‌పించే క్రైమ్ స్టోరీ?

June 2, 2020 at 8:06 am

ఈ మ‌ధ్య కాలంలో అత్యాచారాలు సినిమాసీన్ల‌ను త‌ల‌పిస్తున్నాయి. కొన్ని సినిమాల్లో ఎలాగైతే జ‌రుగుతుందో అలాగే బ‌య‌ట కూడా జ‌రుగుతుందా అంటే జ‌రుగుతుంది అని చెప్పుకోవ‌చ్చు ఈ ఘ‌ట‌న‌ని బ‌ట్టి. ఇటీవ‌లె త‌మిళ‌నాడులో ఓ ప్రేమ‌జంట క‌రోనా కార‌ణంగా గ‌త కొంత కాలంగా క‌లుసుకోవ‌డం లేదు. వారిద్ద‌రూ ఒకే ఊరికి చెందిన‌వారు. ఒకే ఆఫీసులో ప‌ని చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ మ‌ధ్యనే లాక్‌డౌన్ పూర్త‌వ‌గా ఆఫీసు తెరుచుకోవ‌డంతో తిరిగి ఇద్ద‌రూ క‌లిసే అవ‌కాశం దొరికింది.

దీంతో వీరిద్ద‌రూ ఆఫీస్ స‌మ‌యం ముగిశాక కాసేపు ఊసులాడుకునేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి బైక్‌ని పార్క్ చేసి అటు ప‌క్క‌గా ఉన్న పొద‌ల్లోకి వెళ్ళారు. దీంతో వారిని గ‌మ‌నించిన దుండ‌గులు నలుగురు అటుగా వెళ్ళి ఆ యువ‌కుడిని చెట్టుకి క‌ట్టేసి తీవ్రంగా కొట్టారు. అంతేకాక ఆ యువ‌తి పైన ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాచారం చేసి దాన్నివీడియోల్లో బంధించారు. ఇంకా వారి వ‌ద్ద ఉన్న న‌గ‌లు, డ‌బ్బులు మొత్తం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రిక‌న్నా చెబితే వీడియోలు లీక్ చేస్తామ‌ని బెదిరించారు.

దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ఆ ప్రేమ జంట ఎలాగోలా నాలుగు రోజుల తర్వాత ధైర్యం చేశారు. వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన హేమరాజ్ (28), నందకుమార్ (20), మురుగన్ (22)ను అరెస్ట్ చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎక్క‌డైన నిర్మానుష్య ప్ర‌దేశాల‌కు వెళ్ళ‌స్త్రముందు ఎంతైనా కొంచం ఆలోచించాల్సిన అవ‌కస‌రం ఉంది.

ఇదెంత ఘోర‌మంటే…సినిమాని త‌ల‌పించే క్రైమ్ స్టోరీ?
0 votes, 0.00 avg. rating (0% score)