ఇన్సురెన్స్ డ‌బ్బుల కోసం భార్య ఎంత నీచానికి దిగ‌జారిందంటే?

June 23, 2020 at 8:17 am

భార్యా భ‌ర్త‌ల బంధానికి అర్ధం లేకుండా పోతుంది. డ‌బ్బుల కోసం ఎలాంటి అఘాయిత్యాల‌కైనా వెన‌కాడ‌టం ఏదు. ఏం చెయ్య‌డానికైనా రెడీ అంటున్నారు. ఇన్సురెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం హతియా తండాకు చెందిన బాదావత్ వీరన్న తాగుడుకు అలవాటు పడ్డాడు. భార్యపిల్లలను స‌రిగా చూసుకోకుండా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన ఆయన భార్య యాకమ్మ అతన్ని చంపాలని, దాంతో వేధింపులు పోవడమే కాక బీమా పైసలు వస్తాయని ఆశపడింది.

చెన్నారావుపేట మండలం శంకర తండాలో ఉండే వీరన్న చెల్లెలు భూక్య బుజ్జి, ఆమె భర్త బిచ్యలతో కలిసి ఈనెల 19న హత్య చేసినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. తండా సమీపంలో ముగ్గురు కలిసి వీరన్నను చంపి కెనాల్లో పడేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించిన పర్వతగిరి పోలీసులు.. సోమవారం వారిని పట్టుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.

ఇన్సురెన్స్ డ‌బ్బుల కోసం భార్య ఎంత నీచానికి దిగ‌జారిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts