ఏపీలో అందుబాటులో ఉండే రైళ్లు ఇవే…వివ‌రాలిలా?

June 1, 2020 at 8:31 am

క‌రోనా కార‌ణంగా ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఆగిపోయాయి. ప్రపంచ‌మంతా ఒక్క‌సారిగా లాక్‌డౌన్‌కి వెళ్ళిపోయింది. దీనితో వేరే ఊర్ల‌కి వెళ్ళిన‌వాళ్ళు కూడా ప్ర‌యాణ సౌక‌ర్యం లేక అక్క‌డ చిక్కుకుపోవ‌ల‌సి వ‌చ్చింది. అయితే నేటి నుంచి రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 200 రైళ్లను పునఃప్రారంభించ‌నున్నారు. రైల్వే శాఖ ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. కేవ‌లం రిజర్వేషన్ ఉంటేనే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్ కి రావాల్సి ఉంటుంది.

అలాగే ప్రతీ ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. ధర్మో స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నారు. రైలులో ప్ర‌యాణించే ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. అనారోగ్య లక్షణాలుంటే ప్రయాణానికి అనుమతించరు. అలాగే తక్కువలగేజీతో రావాలని రైల్వేశాఖ సూచిస్తోంది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. ఇక రైళ్ల వివరాలు ఇలా… ఉన్నాయి.

Train Number-02728 హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ, రాజమండ్రి (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-027289 విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (డైలీ) రాజమండ్రి, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-07201 గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)

Train Number-07202 సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)

Train Number-02793 తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (డైలీ) కడప, గుంతకల్లు (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02794 నిజామాబాద్-తిరుపతిరాయలసీమ ఎక్స్‌ప్రెస్ (డైలీ) గుంతకల్లు, కడప(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02805 విశాఖపట్న-న్యూ ఢిల్లీ (డైలీ) రాజమండ్రి, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02806 న్యూ ఢిల్లీ-విశాఖపట్నం (డైలీ) విజయవాడ, రాజమండ్రి(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-01019 ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, విశాఖపట్నం(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-01020 భువనేశ్వర్-ముంబైకోణార్క్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-01301 ముంబై-బెంగళూరుఉదయన్ ఎక్స్‌ప్రెస్ గుంతకల్, అనంతపురం(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-01302 బెంగళూరు-ముంబైఉదయన్ ఎక్స్‌ప్రెస్

Train Number-02296 ధన్‌పూర్-బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్)

Train Number-02297 బెంగళూరు-ధన్‌పూర్సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్)

Train Number-02703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ విశాఖ, విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ విజయవాడ, విశాఖ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02245 హౌరా-యశ్వంత్‌పూర్దురంతో ఎక్స్‌ప్రెస్ విజయవాడ, రేణిగుంట(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)

Train Number-02246 యశ్వంత్‌పూర్-హౌరాదురంతో ఎక్స్‌ప్రెస్ రేణిగుంట

Train Number-02692 న్యూ ఢిల్లీ-బెంగళూరు సిటీ అనంతపురం

Train Number-02691 బెంగళూరు సిటీ అనంతపురం

Train Number-02434 న్యూఢిల్లీ-చెన్నై విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)

Train Number-02435 చెన్నై విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)

ఏపీలో అందుబాటులో ఉండే రైళ్లు ఇవే…వివ‌రాలిలా?
0 votes, 0.00 avg. rating (0% score)