చై,శ్యామ్ జంట‌కి క‌రోనా?

June 25, 2020 at 9:31 pm

అక్కినేని కోడ‌లు సమంత బెస్ట్ ఫ్రెండ్, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఆమె భర్త ప్రీతం రెడ్డికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అంటే వెంట‌నే అక్కినేని కుటుంబం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన‌‌ సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా స‌మంత‌- చైత‌న్య జంట ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలిసింది.

అయితే ఆ ఇద్ద‌రికీ కూడా పాజిటివ్ అన్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మార‌డంతో అక్కినేనీస్ నుంచి తాజాగా ఓ లీక్ అందింది. నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట‌కు కొవిడ్ నెగెటివ్ అన్న రిపోర్ట్ వ‌చ్చింద‌ట‌. ఆ ఇద్ద‌రూ సేఫ్ గా ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటూ నిర్భంధంలో ఉన్నార‌ట‌. దీంతో ఫ్యాన్స్ లో క‌ల‌వ‌రానికి చెక్ ప‌డిన‌ట్టే.

చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరి రిలీజ్ కి సిద్ధంగా ఉండ‌గా.. త‌దుప‌రి మ‌రో చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. స‌మంత అటు త‌మిళ చిత్రం స‌హా మ‌రిన్నిటిని ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు పెరుగుతుండ‌డంతో కొన్నాళ్లుగా షూటింగులు వాయిదా ప‌డిన సంగ‌తి విధిత‌మే. ఇప్ప‌ట్లో చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభించే యోచ‌నలో ఎవ‌రూ లేరు.

చై,శ్యామ్ జంట‌కి క‌రోనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts