పెళ్ళి చేసుకుంటాన‌ని స‌హ‌జీవ‌నం చేసి చివ‌రికి ఏం చేశాడంటే?

June 13, 2020 at 8:18 am

ప్ర‌స్తుత రోజులు ఎలా ఉన్నాయంటే త‌న నీడ‌ను తానే న‌మ్మేట‌ట్లు లేదు అన్న‌ట్లు ఉంది. నెట్‌వ‌ర్క్ పెర‌గ‌డంతో ఆన్‌లైన్ ప‌రిచ‌యాలు పెరుగుతున్నాయి. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేక‌పోతున్నారు. అలాగే మోస‌గాళ్ళు కూడా చాలా ఈజీగా మోసం చేసేస్తున్నారు. ప్రేమ అన్నాడు పెళ్ళిఅన్నాడు. స‌హ‌జీవ‌నం చేసి చివ‌రికి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని బ‌హ‌దూర్‌పూరాలో చోటు చేసుకుంది. ఓ మహిళ కొంతకాలం క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలే తన వివరాలను ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అది చూసిన యాసరుల్లా(25) అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి పరిచయం పెంచుకున్నాడు.

ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెర‌గ‌డంతో పెళ్ళికి స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌హ‌జీవ‌నం చేద్దామ‌ని ఇద్ద‌రూ ఒకే ఇంట్లో ఉండ‌సాగారు. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న అత‌డు ఆమె పై అనేక సార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఇంకెంతకాలం సహజీవనం చేద్దాం… వెంటనే పెళ్లి చేసుకో అని ఆమె కోరడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఏమి చెయ్యాలో అర్ధం కాని ప‌రిస్థితుల్లో బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

పెళ్ళి చేసుకుంటాన‌ని స‌హ‌జీవ‌నం చేసి చివ‌రికి ఏం చేశాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts