ప్ర‌భాస్ పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందా?

June 3, 2020 at 9:44 pm

“ప్ర‌భాస్ న‌టిస్తున్న‌త‌న 20వ చిత్రాన్ని ఆపేశారా? అంటే తాజాగా ఉన్న ప‌రిణామాలు చూస్తుంటే అలానే క‌నిపిస్తున్నాయి. “బ్యాన్ యువి క్రియేష‌న్స్!!“ అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ గురించి తెలిసిందే. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు క‌ల‌గ‌క మాన‌డంలేదు. అస‌లింత‌కీ ఆ అనుమానం రావ‌డానికి అస‌లు కార‌ణ‌మేమిటంటే… ప్ర‌భాస్ 20 కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ లేదు? నిజంగానే ఈ మూవీని ఆపేశారా? అంటూ చ‌ర్చ మొద‌లైంది. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ యువి క్రియేష‌న్స్ కానీ ప్ర‌భాస్ కానీ దీనిపైన ఏమీ స్పందించ‌నే లేదు.

రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న‌ రొమాంటిక్ పీరియడ్ డ్రామా ఇది. ఈ చిత్రంతో ప్రభాస్ ఓ బిజినెస్ మ్యాగ్నెట్ గా క‌నిపించ‌నున్నాడు. పూజా హెగ్డే ఒక పేద‌రాలిగా క‌నిపించ‌నుంది. రిచ్ – పూర్ ల‌వ్ స్టోరీ ఎక్స్ క్లూజివ్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. దీనికి తోడు వేర్వేరు కాలాల్లో రెండు యుగాలలో రొమాంటిక్ డ్రామా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని.. ఇందులో పూజా హెగ్డే ప్రభాస్ ప్రేమికురాలిగా ఇర‌గ‌దీస్తుంద‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ లేక ఫ్యాన్స్ చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. నేటి సాయంత్రం # Prabhas20Shelved అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌డంతో అందరూ షాక్‌కు గురయ్యారు. టాలీవుడ్ ఫ్యాన్స్ లో దీనిపై ఆస‌క్తిక‌ర‌ చర్చ జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం నిలిపివేశారన్న చ‌ర్చా వేడెక్కించింది. ఎందుకంటే ముందే అనుకున్నట్లుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో షూటింగ్ చేయాల్సి ఉండ‌గా క‌రోనా వ‌ల్ల ఏదీ ముందుకు సాగలేరు. అయితే అస‌లు కార‌ణ‌మేమిటా? అన్న‌ది చూస్తే.. ప్రభాస్ 20 కి సంబంధించిన స‌మాచారం ఏదీ లేకుండా అభిమానుల‌కు దూరం చేయ‌డం వ‌ల్ల‌నే ఈ కోపం అని తేలింది. అభిమానుల్లోని నిరాశ వ‌ల్ల‌నే ఈ యాంగ‌ర్ అని తేలింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భాస్ 20 టైటిల్ ని ప్ర‌క‌టంచ‌లేదు. దీంతో అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం #BanUVCreations అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. అప్పుడు కూడా మేక‌ర్స్ వాటిపై స్పందించలేదు. తాజా స‌న్నివేశంపై భయాందోళనలు సృష్టించడానికి, ఈ రోజు అభిమానులు ప్రభాస్ 20 ఆగిపోయింది!! అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఎంతో ఆక‌లితో ఉన్న అభిమానుల్ని నిరాశ‌ప‌రిస్తే ఇలానే ఉంటుంది మ‌రి. వేడి మీద‌ ఉన్న ప్రభాస్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు యువి క్రియేషన్స్ ఏదైనా అప్ డేట్ ని విడుదల చేస్తుందా? అన్న‌ది వేచి చూడాలి. మ‌రి చివ‌రికి ఏమి చేస్తారో ఏమో.

ప్ర‌భాస్ పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts