యంగ్ హీరోల‌తో మ‌హేష్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా?

June 4, 2020 at 8:44 am

మహేష్ కొన్నాళ్లుగా తాను నటిస్తున్న ప్రతి సినిమా హీరో మాత్ర‌మే కాదు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటున్న విష‌యం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతలలో ఒకరిగా ఉన్న మహేష్.. పరుశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నార‌ని స‌మాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14ప్లస్ రీల్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో జి ఎమ్ బి ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిట్ ఒక పార్టనర్ గా ఉన్నారు. ఇక ఈ సంస్థ ద్వారా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు నిర్మించారు.

మొదటి సారి మహేష్ మరో హీరోతో సినిమాని చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో అడివి శేషుతో మేజర్ అనే బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల కానుంది.అలాగే టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమల హీరోలతో కూడా ఆయన సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారట. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ మరియు కార్తీ వంటి హీరోలు కూడా ఉన్నారట. ఓ వైవు స్టార్ గా వరుస చిత్రాలు చేస్తూనే.. పూర్తి స్థాయిలో నిర్మాతగా మారాలన్నది ఆయన ప్లాన్ అట. మ‌రి ఇది ఇక‌మునుముందు ఏ విధంగా కొన‌సాగుతుందో వేచి చూడాలి.

యంగ్ హీరోల‌తో మ‌హేష్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts