రౌడీ హీరో త‌ర్వాత కండ‌ల వీరుడితో సినిమానా?

June 22, 2020 at 9:00 pm

క్రేజీ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్‌..రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సినిమాకి ఉండే క్రేజే వేరు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `ఫైట‌ర్`. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్స్, వీడియోస్‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా తెర‌కెక్కుతోంది. ఫైటర్ చిత్రీక‌ర‌ణ ఎక్కువ భాగం ముంబైలోనే చేస్తున్నారు. నేప‌థ్యం అంతా అక్క‌డిదే. ఇందులో ప‌ర్ ఫుల్ ఫైట‌ర్ గా దేవ‌ర‌కొండ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే ఈసినిమాపై పూరి ధీమా వ్య‌క్తం చేసారు. పూరి గ‌తంలో ఎప్పుడు సినిమా గురించి ఇంత‌లా బూస్టింగ్ ఇచ్చింది లేదు.

అదిరిపోయే స్క్రిప్ట్. స్క్రిప్ట్ ని మించి విజ‌య్ దేవ‌ర‌కొండ పెర్పామెన్స్ ఉంటుంద‌న్నారు. విజ‌య్ నేచుర‌ల్ పెర్పామెన్స్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందేన‌న్నారు. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో కూడా తాను సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే స‌ల్మాన్ ని ఓ సారి క‌లిశార‌ట‌. లాక్ డౌన్ త‌ర్వాత మ‌రోసారి క‌ల‌వ‌నున్నార‌ని పూరి రివీల్ చేసారు. ఇక బాలీవుడ్ లోనే కొన‌సాగుతారా? అని ప్ర‌శ్న త‌లెత్త‌గా అలాంటింది లేద‌ని.. స‌ల్మాన్ తో సినిమా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులోనే చేస్తాన‌ని పూరి తెలిపారు. పూరి గ‌తంలో బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ తో బుడ్డా చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని‌వ్వ‌లేదు. త‌ర్వాత పూరి హిందీలో సినిమాలు చేసింది లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఫైట‌ర్ తో రీఎంట్రీ ఇవ్వ‌డం…ఆ వెంట‌నే స‌ల్మాన్ ఖాన్ తో సినిమా చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అలాగే స‌ల్మాన్ పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు తెలుగు క‌థ‌ల‌ను బాలీవుడ్ లో రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స‌ల్మాన్ వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ బంద్ అవ్వ‌డంతో స‌ల్మాన్ ముంబై శివార్ల‌లో ఉన్న త‌న ఫామ్ హౌస్ లో కాల‌క్షేపం చేస్తున్నారు.

రౌడీ హీరో త‌ర్వాత కండ‌ల వీరుడితో సినిమానా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts