లాక్‌డౌన్‌లో సంపాద‌న లేద‌ని…భార్య భ‌ర్త‌ను ఏం చేసిందంటే?

June 1, 2020 at 8:46 am

క‌రోనా కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌పంచ‌మంతా కూడా ఒక్క‌సారిగా లాక్‌డౌన్ కి వెళ్ళిపోయింది. చిన్న కార్మికుల నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్‌ల సైతం పూర్తిగా వారి కార్య‌క‌లాపాల‌కు విరామం ఇచ్చి వైర‌స్ క‌ట్ట‌డి నిమిత్తం ఇళ్ళ‌లోనే ఉండిపోవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో చాలా మంది ఆర్ధిక ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇదే విష‌య‌మై ఓ కుటుంబంలో చిచ్చు రేగింది. లాక్‌‌డౌన్ కార‌ణంగా భ‌ర్త‌కు సంపాద‌న లేద‌ని భార్య ఎంత అఘాయిత్యానికి పాల్ప‌డిందంటే…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖండ్వా పరిధిలోని ఖర్కలా గ్రామానికి చెందిన రమేష్(38) లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. పనుల్లేక పోవడంతో సంపాదన కరువైంది. ఇదే విషయమై రమేష్ భార్య లీల రోజూ భర్తతో గొడవపడేది. ఏదో ఒక పని చూసుకోవాలంటూ తీవ్రవాగ్వాదానికి దిగేది. అదే విషయమై ఈ నెల 24న మరోమారు ఘర్షణ జరగడంతో ఇద్ద‌రూ కూడా తీవ్ర స్థాయిలో గొడ‌వప‌డ్డారు. తల్లి ప్రేమ్ బాయితో కలసి భర్తని తీవ్రంగా కొట్టింది. తల్లీకూతుళ్లు కలసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో రమేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అది గమనించిన రమేష్ తల్లి, సోదరుడు వెంటనే ర‌మేష్‌ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేష్ 27న మరణించాడు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని బాధితుడు చ‌నిపోయే ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్ర‌కారం భార్య‌ను ఆమె త‌ల్లిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

లాక్‌డౌన్‌లో సంపాద‌న లేద‌ని…భార్య భ‌ర్త‌ను ఏం చేసిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts