శృంగారంలో ఎక్కువగా వయాగ్రా వాడితే ఇక అంతే సంగ‌తులు?

June 9, 2020 at 7:18 am

శృంగారంలో ఎవ్వ‌రైనా స‌రే త‌న పార్ట్‌న‌ర్‌తో ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేయాల‌నే అనుకుంటున్నారు. చాలా మంది దానికోసం కొన్ని మందులు వాడుతుంటారు. వ‌యాగ్రా లాంటివి వాడ‌టం వ‌ల‌న కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది. ఇక వ‌యాగ్రా వాడటం వల్ల అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని కొందరు వాడుతుంటారు. అయితే వీటి వల్ల ఉపయోగాలు ఎన్నో అనారోగ్యం పాలు చేసేది కూడా అంతే శాతం ఉంది. ఇకపోతే చాలామంది తమ లైంగిక లోపం ఉంది అన్న అపోహతో వయాగ్రాని వాడుతుంటారు. అలా వాడుతున్న వారిలో 80 శాతం మందికి కేవలం మానసిక సంబంధించిన సమస్యలు తప్ప లైంగిక సమస్యలు ఉండవని తెలుపుతున్నారు శాస్త్ర‌వేత్త‌లు. నిజానికి వారి ఆలోచనలు వారి కొంప ముంచుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మానసిక సమస్యను వయాగ్రా ఏమాత్రం తగ్గించాలని తెలియజేస్తున్నారు.

ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వారికి వైద్య చికిత్సలు అవసరమవుతాయి తప్ప వయాగ్రా కాదని తెలియజేస్తున్నారు. శారీర‌కంగా ఏమ‌న్నా స‌మ‌స్య‌లు ఉన్నా వైధ్యుల స‌ల‌హా మేర‌కు మందులు వేసుకోవాల‌ని త‌ప్పించి అన‌వ‌సరంగా వయాగ్రా వాడటం వల్ల శృంగారంలో ఎక్కువ ఎంజాయ్ చేయడం ఏమో కానీ చాలా ప్రమాదాలకు గురవుతారు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి లోపం లేని కేవలం ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే ఇలాంటి వయాగ్రాని వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుపుతున్నారు నిపుణులు. ఇది నిజానికి వారు అనుకున్నట్లుగా శృంగారం వాంఛను పెంచే ఉత్తరం కాకుండా అది పురుషాంగానికి రక్తసరఫరాను పెంచే మందు మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు.

నిజానికి అంగస్తంభన లోపాలు లేని వారికి మరే ఇతర బాధలు లేని వారికి అసలు వయాగ్రా వాడటం అనవసరమని తెలుపుతున్నారు నిపుణులు. నిజానికి శృంగార సమయంలో పాజిటివ్ గా ఉండే మనసు మాత్రమే లైంగిక ఉత్ప్రేరకమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే వయాగ్రా వాడటం వల్ల కళ్ళకు తీవ్ర నష్టం కలుగుతుందని… వర్ణ దృష్టి ఎక్కువ ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో నిపుణులు తెలియజేశారు. అంతే కాకుండా వారు త్వరగా గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

శృంగారంలో ఎక్కువగా వయాగ్రా వాడితే ఇక అంతే సంగ‌తులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts