1386 కేసులు పెట్టాం: మంత్రి పెద్దిరెడ్డి

June 17, 2020 at 5:55 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాను ఏ మాత్రం కూడా సహించేది లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. తాజాగా ఆయన శాసన మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు ఆయన. రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేస్తున్నామని ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ అన్నారు. నూతన పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేస్తున్నామని స్పష్టం చేసారు.

ఇప్పటి వరకు ఇసుక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఘటనలపై 1386 కేసులు పెట్టామన్నారు మంత్రి. 2500 మందిపై చర్యలు తీసుకున్నామని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న1752 వాహనాలను సీజ్ చేశామని ఆయన వివరించారు. ఎడ్ల బండ్లకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని ఆయన వివరించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

శాస్త్రీయంగా ఇసుకు పాలసీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గడిచిన అయిదేళ్ళలో టీడీపీ ఇసుకను దోపిడీ చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము ఇసుక దోపిడీని అడ్డుకోవడాన్ని టీడీపీ సహించలేక పోతోందని ఈ సందర్భంగా మంత్రి ఆరోపణలు చేసారు. ఇసుక అక్రమాలకూ అసలు ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన వివరించారు. ఎంతటి వారిని అయినా సరే సహించేది లేదన్నారు మంత్రి.

1386 కేసులు పెట్టాం: మంత్రి పెద్దిరెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts