ప్రభాస్ కోసం 5 కోట్ల హాస్పిటల్.. అందుకేనా..?

June 22, 2020 at 12:41 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బాహుబలి సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ‘సాహో’ సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ త‌న 20వ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తి అయ్యింది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూ చూసని విధంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి `రాధేశ్యామ్` అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షెడ్యూల్ కోసం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో 5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన హాస్పిటల్ సెట్‌ ను ప్ర‌భాస్ కోసం మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంద‌. నాలుగు అంతస్తులలో హాస్పిటల్ సెట్ ను ఓ స్టూడియోలో నిర్మిస్తున్నారు. ఇందులో ఐసియు వార్డ్, ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డులు మరియు డాక్టర్ రూమ్స్ ఉన్నాయట. ఈ గ్రాండ్ సెట్‌లో నెల రోజులకు పైగా ప్ర‌భాస్‌తో షూటింగ్‌ చేయనున్నారని.. ఆగస్టు నుండి షూట్ ప్రారంభమవుతుందని స‌మాచారం. కాగా, భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ కోసం 5 కోట్ల హాస్పిటల్.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts