స‌డెన్‌గా వాయిదా ప‌డిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకేనా..?

June 2, 2020 at 11:43 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలతో ఈ టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవ్వ‌నున్నారు. ఏపీలో కరోనా వైరస్‌ ఎలా ఉంది. ఆర్థిక పరిస్థితేంటి, లాక్ డౌన్ ఎలా అమలవుతోంది, మినహాయింపులు ఇచ్చాక కేసుల్లో పెరుగుదల ఎలా ఉంది, కట్టడి కోసం చర్యలేం తీసుకుంటున్నారు వంటి అంశాలపై సీఎం జగన్ అమిత్‌షాతో చర్చించనున్నారు.

అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై షాకి వివరించనున్నారు. అయితే అనుకోకుండా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. ఇక ఈ రాత్రి 7 గంటలకు అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు జగన్. రేపు కూడా అక్కడే ఉండి తిరిగి వచ్చేలా టూర్‌ని షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి స‌డెన్‌గా ఆయన పర్యటన వాయిదా పడింది.

అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా సమావేశాలతో బిజీగా ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే హస్తినకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, గత జనవరిలో అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులు, మండలి రద్దు తర్వాత ఢిల్లీ వెళ్లారు జగన్. సెప్టెంబర్‌లో వెంటవెంటనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పెద్దలను కలిశారు సీఎం. అప్పుడే హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల‌నుకున్న జ‌గ‌న్ టూర్ చివ‌రి నిమిషంలో వాయిదా ప‌డింది.

స‌డెన్‌గా వాయిదా ప‌డిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts