స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లని నియమించిన ఏపీ సర్కార్…!

June 2, 2020 at 12:37 pm

సమాచార శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నియమిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. నియమించిన వారు ఎవరూ అనేది ఒకసారి చూస్తే…

 

చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌ కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌ రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డిని ఏపీ సర్కార్ నియమించింది. వీరికి కీలక బాధ్యతలను అప్పగించింది ఏపీ ప్రభుత్వం. వీరందరూ నిరంతరం సమాచారం,కథనాలపై నివేదికలను రూపొంది౦చి… వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’గా ప్రభుత్వం నియమించింది. అయితే వారి పదవుల విషయంలో తాజాగా కీలక మార్పులు చేసింది. తాజాగా వారి పోస్టుల్ని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది.

స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లని నియమించిన ఏపీ సర్కార్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts