‘కిస్ మీ’ అంటోన్న ప్ర‌భాస్‌.. వైరల్‌గా మారిన వీడియో..!!

June 14, 2020 at 10:28 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. కేవ‌లం తెలుగు హీరో అంటే పొర‌పాటే. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప్యాన్ ఇండియన్ స్టార్. బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్‌కు అభిమానుల్ని తెచ్చి పెట్టిన సినిమా బాహుబలి. ఒక ప్ర‌భాస్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అన్నట్టుగానే ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబలి చిత్రం రెండు పార్ట్‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి.

ఈ సినిమాతోనే ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ వెంట పడుతున్నాయంటే.. బాహుబలి సినిమాలో ఆయ‌న ఎంత మాయ చేశాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ముఖ్యంగా బాహుబలి2లో ప్రభాస్ మహాష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీన్… ఆ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ బాహుబ‌లి ప్ర‌భాస్‌నే `కిస్ మీ` అంటున్నాడు. రియ‌ల్‌గా కాదండోయ్.. కొంత‌మంది క్రియేటివిటీ.

మహాష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీన్‌లో.. ప్రభాస్ డైలాగ్స్‌కు, జనం జేజేలకు బదులు ప్రముఖ చాక్లెట్ డైరి మిల్స్ యాడ్‌ను పెడుతూ ఎడిట్ చేశారు కొంద‌రు. నిజంగా బాహుబలి ‘కిస్ మీ’ అని అంటున్నట్లు లిప్ సింక్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు. క్రియేటివిటీకి ఇదే నిదర్శనం అనేలా కొంతమంది ఎడిట్ చేసిన ఆ సీన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ వీడియోను త‌న‌ ఇనస్టాలో షేర్ చేయ‌డం విశేషం. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

‘కిస్ మీ’ అంటోన్న ప్ర‌భాస్‌.. వైరల్‌గా మారిన వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts