బాల‌య్య అభిమానులా మ‌జాకా.. ఏకంగా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారుగా..!!

June 21, 2020 at 8:00 am

నంద‌మూరి న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఈయ‌న‌కు ఎంత మంది అభిమానులు ఉంటారో ఇప్పుడు ప్ర‌త్యేకంగా లెక్క‌లు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ చిత్రాన్ని చేస్తున్న‌ విషయం తెలిసిందే. మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మించబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల ఈ స్టార్ హీరో 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.

బాలకృష్ణ షష్టి పూర్తి సందర్భంగా ఆయన ఫోటోలతో సోషల్ మీడియా మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, బాల‌య్య బ‌ర్త్‌డేకు మ‌రో అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చారు అభిమానులు. వాస్త‌వానికి కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో, తన బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఈ ఏడాది నిరాడంబరంగా జరపాలని బాలయ్య అభిమానుల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించడ‌మే త‌న‌కు ఇచ్చే పెద్ద గిప్ట్ అని వెల్ల‌డించారు. ఇక బాలకృష్ణ ఆదేశాల‌ను అనుస‌రించిన‌ నందమూరి ఫ్యాన్స్.. ఇంట్లోనే ఉండి, అభి‌మాన‌ కథానాయకుడి జన్మదిన వేడుకలను రికార్డు స్థాయిలో నిర్వహించారు.

ఈ క్ర‌మంలోనే అనంతపురంకు చెందిన ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జగన్ పర్యవేక్షణలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ని గౌరవిస్తూ.. గ్లోబల్ నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో (డాక్ట‌ర్స్‌, పోలీస్‌, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది)కి సెల్యూట్ చేస్తూ ఉదయం10 గంటల10 నిమిషాలకు ఏకకాలంలో సుమారు 21 వేల కేకులను కట్ చేశారు. అయితే విశ్వవ్యాప్తంగా ఈ రేంజ్‌లో కేక్ కట్ చేయడం ఇదే మొదటిసారి అని తెలుపుతూ వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధులు దీనిని వరల్డ్ రికార్డుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు కుదుట‌ప‌డ్డ త‌ర్వాత‌.. సంబంధిత పత్రాలను బాలకృష్ణకు స్వయంగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

బాల‌య్య అభిమానులా మ‌జాకా.. ఏకంగా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారుగా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts