జగన్‌తో మీటింగ్‌కి నేను రానని చెప్ప‌లేదు.. బాల‌య్య షాకింగ్ కామెంట్స్‌

June 10, 2020 at 9:16 am

ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీలో క‌రోనా లాక్‌డౌన్ వేళ జ‌రుగుతున్న పరిణామాలతో బాలయ్య సీరియస్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ పెద్ద‌లు భేటీ అయ్యి.. షూటింగ్స్‌కు అనుమతి, థియేటర్లు తెరిపించడం సహా పలు అంశాలపై చర్చించారు. కానీ, ఇందుకు బాల‌య్య‌ను పిల‌వ‌లేదు. దీంతో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని బాలకృష్ణ చెప్ప‌డంతో.. హాట్ టాపిక్‌గా మారింది. ఇక నిన్న టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయి చిత్ర పరిశ్రమ సమస్యలు నివేదించారు.

ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రాజమౌళి, నాగార్జున, దిల్ రాజు, సి.కల్యాణ్, సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి కూడా బాల‌య్య హాజరు కాలేదు. అయితే గ‌తంలో నిర్మాత సీ కళ్యాణ్.. జగన్‌తో జరిగే భేటీకి బాలయ్యను తానే స్వయంగా ఆహ్వానించినట్టు తెలిపారు. కానీ, పుట్టిన రోజు వేడుకుల సంద‌ర్భంగా ఆయ‌న రాన‌న్నార‌ని సీ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. అయితే తాజాగా బాల‌య్య దీని హాట్ కామెంట్స్ చేశారు. అసలు జగన్‌తో జరిగే చర్చలను నేను రాను అని చెప్పలేదంటూ వాళ్లకు వాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకుని దాన్ని నాపై రుద్దుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కోసం సీఎంని కలుస్తున్నాం అంటే.. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అపాయింట్‌మెంట్ ఇచ్చామని చెప్పాలి.

అంతేతప్ప ఒక పర్శన్‌కి(చిరంజీవి) అపాయింట్‌మెంట్ అనకూడదు. ఇక అందులో అతని కూడా ఎవరెవర్ని తీసుకుని రావాలో రాసిపెట్టి ఉంది. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ ఒక వ్యక్తికి సంబంధించిన కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఛాంబర్‌కి అధికారం ఉంటుంది. వాళ్లు చెప్తారు ఎవరెవరువెళ్లాలో ఏంటో. అదే స‌మ‌యంలో వాళ్లు నన్ను సంప్రదించడంతో సీఎంను కలవాలా? లేదా అన్నదానిపై నేను ఆలోచిస్తా అని చెప్పా. కానీ, ఈలోపు వాళ్లే అనౌన్స్ చేశారు.. బాలకృష్ణ బర్త్ సందర్బంగా ఆయన రానన్నారని వాళ్లే చెప్పేశారు. నాకు తెలియకుండా.. నా విషయం నాకు సంబంధం లేకుండా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఇక ఆ త‌ర్వాత నేను దానిపై స్పందించ‌లేదు అంటూ బాల‌య్య సంచ‌ల‌న వ్య‌ఖ్య‌లు చేశారు. దీంతో బాల‌య్య వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

జగన్‌తో మీటింగ్‌కి నేను రానని చెప్ప‌లేదు.. బాల‌య్య షాకింగ్ కామెంట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts