ఛీ, ఛీ… నేనెందుకు మాట్లాడాలి? నాగబాబు వ్యాఖ్యలకు బాల‌య్య రియాక్ష‌న్

June 2, 2020 at 8:06 am

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో వారి సమస్యలు, అలాగే షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడంపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కొంతమంది సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసానిని కలిశారు. ఆ సమావేశాలకు అగ్రనటుడు బాలకృష్ణను పిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ పరిశ్రమ వర్గాలను కించపరిచేలా మాట్లడటం తగదని, అందుకు క్షమాపణ చెప్పాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి అని నాగబాబు గట్టిగా మందలించడంతో ఈయ‌న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే న‌గబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా.. బాల‌య్య మౌనంగానే ఉన్నాయి.

కానీ, తాజాగా ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించింది. నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగ్గా… “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ బదులిచ్చారు. అయితే, భూములు గురించి ఏదో మాట్లాడుకున్నారు అని మీరు అన్నారు. అదేం లేదంటారా? అని యాంకర్ అడిగినప్పుడు.. ‘ఏమో.. ఉండొచ్చు’ అన్నట్టు హావభావాలు వ్యక్త పరిచారు బాలయ్య.

ఛీ, ఛీ… నేనెందుకు మాట్లాడాలి? నాగబాబు వ్యాఖ్యలకు బాల‌య్య రియాక్ష‌న్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts