పెళ్లైన 2 రోజుల‌కే క‌రోనాతో వ‌రుడు మృతి.. మ‌రో 95 మందికి పాజిటివ్‌..!!

June 30, 2020 at 10:35 am

క‌రోనా వైర‌స్‌.. ఎక్క‌డో చైనాలో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. చిన్నా.. పెద్ద‌, ఉన్నోడు.. లేనోడు అనే తేడా లేకుండా అంద‌రికీ క‌రోనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఇక తాజాగా పెళ్లైన రెండు రోజుల‌కే ఓ వ‌రుడు క‌రోనాతో మృతి చెందాడు.

అయితే ఈ వివాహానికి హాజరైన వారిలో 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం మ‌రింత ఆందోళ‌న రెకెత్తించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్‌లో (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్లి కోసం మే 12న గ్రామానికి వ‌చ్చాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడినా గుర్తించలేకపోయాడు. ఇక పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ, పెళ్లైన రెండు రోజుల‌కే వరుడి ఆరోగ్యం క్షీణించ‌డంతో.. వెంట‌నే పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు.

కానీ, మ‌ధ్య‌లోనే మార్గమధ్యంలోనే అత‌డు మృతి చెందాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి కరోనా పరీక్షలు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. ఇక‌ ఈ విషయం తెలిసిన అధికారులు వివాహానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే వధువుకు మాత్రం పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం బాధితులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించిన‌ట్టు తెలుస్తోంది.

పెళ్లైన 2 రోజుల‌కే క‌రోనాతో వ‌రుడు మృతి.. మ‌రో 95 మందికి పాజిటివ్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts