భారత సైనికులను వెంటాడి వేటాడి చంపిన చైనా ఆర్మీ…!

June 17, 2020 at 5:46 pm

సరిహద్దుల్లో చైనా బలగాలు చెలరేగిపోతున్నాయి. సరిహద్దుల్లో భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని చైనా దాడులు చేసింది. మొత్తం 23 మంది భారత సైనికులు చైనా చేసిన దాడుల్లో బలైపోయారు. చల్లగా ప్రశాంతంగా ఉండే హిమాలయాల్లో చైనా ఆర్మీ దాడులకు పాల్పడింది.ఈ దాడిలో పాల్గొంది చైనా డెత్ స్క్వాడ్ అని సమాచారం. ప్రాణ భయంతో భారత సైనికులు నదిలో దూకినా సరే వెంటాడి చంపారు.

ఇక తుపాకులతో కాల్చకుండా వారు దాడులు చేసారు. లాఠీలకు మేకులు ఉన్నాయని, అదే విధంగా కర్రలతో దాడులు చేసారు అని ఇతర సైనికులు వివరించారు. ఐరన్ రాడ్స్ ని కూడా ఇందులో వాడారు అని పేర్కొన్నారు. భారత గస్తీ బృందాలను లక్ష్యంగా చేసుకుని లడక్ కి వంద కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది అని భారత ఆర్మీ అధికారులు మీడియాకు వెల్లడించారు. 101 మంది సైనికులు గాయపడ్డారు.

ఆయుధాలు లేని సైనికులను లక్ష్యంగా చేసుకుని ఎముకలు కోరికే చలిలో చైనా ఆర్మీ దాడులు చేసింది. బీహార్ రెజిమెంట్ కి కల్నల్ సంతోష్ నాయకత్వం వహిస్తున్నారు. మా వైపు కూడా 35 మంది చనిపోయారు అని చైనా చెప్తుంది. ఇక మరి కొంత మంది భారత సైనికులు మరణించే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం కొందరి ఆరోగ్యం విషమంగా ఉందని చెప్తున్నారు.,

భారత సైనికులను వెంటాడి వేటాడి చంపిన చైనా ఆర్మీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts