రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. అందుకేనా..?

June 1, 2020 at 12:58 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను విల‌విల‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌ను అడ్డుకునేందుకు దేశ‌దేశాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. క‌రోనా రోజురోజుకు కొత్త శ‌క్తితో విజృంభిస్తోంది. మ‌రోవైపు భార‌త్‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ప్రపంచంలో ఎక్కువ కేసులున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. దీనిని బ‌ట్టీ క‌రోనా కేసులు భార‌త్‌లో ఏ స్థాయిలో న‌మోదు అవుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్క‌డ రేపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చిస్తారు. ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన విషయాలను ఆయన వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టికే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts