కరోనా పరిక్షలపై జగన్ సంచలన నిర్ణయం…!

June 22, 2020 at 12:23 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ప్రతీ రోజు 22 వేల వరకు పరిక్షలు చేసిన సందర్భం అనేది ఈ మధ్య కాలంలో లేదు. కరోనా తీవ్రత పెరగడం తో దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో 20 వేలకు పైగా పరిక్షలు చేసారు గాని ఏపీలో కరోనా కేసులు పెరగక ముందు నుంచి కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

ఇక నేడు సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కట్టడికి గానూ ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రోజు రోజుకి తీవ్రత పెరుగుతూ వస్తున్న నేపధ్యంలో కరోనా పరీక్షలను పెంచే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నేడు ఆయన అధికారులతో ప్రస్తావించే అవకాశం ఉంది. దక్షిణ కొరియా నుంచి కిట్స్ కొనుగోలు చెయ్యాలి అని భావిస్తున్నారు.

విజయవాడ, కర్నూలు, ప్రకాశం, అనంతపురం సహా కొన్ని నగరాల్లో కరోనా పరిక్షల సంఖ్యను భారీగా పెంచే ఆలోచనలో సిఎం ఉన్నారు. అదే విధంగా కరోనా ఉన్న ప్రాంతం నుంచి 100 ఇళ్ళ వరకు కరోనా పరిక్షలు చెయ్యాలి అని, ఒక్క కేసు ఉంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో కనీసం వెయ్యి పరిక్షలు చెయ్యాలి అని సిఎం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

కరోనా పరిక్షలపై జగన్ సంచలన నిర్ణయం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts