బ్రేకింగ్: ఏపీలో ఆగని కరోనా సునామి , ఒక్క రోజే..!

June 13, 2020 at 1:31 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏ మాత్రం కట్టడి కావడం లేదు. పరీక్షలను ఎంత వేగంగా చేస్తున్నా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వందల కేసులు ప్రతీ రోజు నమోదు అవుతున్నాయి గాని ఎక్కడా కేసుల ప్రవాహం మాత్రం ఆగడే పరిస్థితి కనపడటం లేదు. అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తూ చూస్తూ ఉండగానే గత పది రోజుల్లో రెండు వేల కేసులు నమోదు అయ్యాయి.

రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది గాని తగ్గడం మాత్రం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 222 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ సర్కార్ పేర్కొంది. వీరిలో ఏపీకి చెందిన వారికి 186 మందికి కోరనా సోకింది అని, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురుకి కరోనా సోకింది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇక ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల వారే ఎపీని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక మొత్తం కేసుల సంఖ్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 1068 గా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 202 మందికి కరోనా సోకింది. ఏపీలో మొత్తం కరోనా కేసులు 5,076 కి చేరుకున్నాయి. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 1865 గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం మరణించిన వారి సంఖ్య 82 కి చేరుకుంది.

బ్రేకింగ్: ఏపీలో ఆగని కరోనా సునామి , ఒక్క రోజే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts