బిగ్ బ్రేకింగ్: కరోనా సరికొత్త రికార్డ్, 12 వేల కేసులు…!

June 11, 2020 at 9:31 am

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం కూడా ఆగే అవకాశాలు అయితే కనపడటం లేదు. రోజు రోజుకి వేల కేసులతో దేశం ఇప్పుడు పూర్తిగా కరోనా గుప్పిట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వందల మరణాలు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. దేశంలో కరోనా కేసులు మూడు లక్షల దిశగా వెళ్ళడం ఇప్పుడు భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. కరోనా మరణాలు కూడా ఆగడం లేదు.

నిన్న ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో దాదాపు 400 మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పవచ్చు. తాజాగా కరోనా కేసులు కూడా కొత్త రికార్డ్ దిశగా వెళ్తున్నాయి. గత 24 గంటల్లో 12,375 కొత్త కేసులు నిన్న ఒక్క రోజే నమోదు అయ్యాయి మన దేశంలో. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 388 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు రెండు రోజుల్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 287,155 గా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మొత్తం మరణాల సంఖ్య చూస్తే 8,107 మంది కరోనాతో మరణించారు. 140,979 మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మన దేశంలో ఇప్పుడు కరోనా విషయంలో కొత్త భయం మొదలయింది. అది ఏంటీ అంటే… ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనాతో పోరాడే వారి ఆరోగ్యం ఎక్కువ మందికి విషమంగా ఉండటం.

బిగ్ బ్రేకింగ్: కరోనా సరికొత్త రికార్డ్, 12 వేల కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts