ఏపీలో మరోసారి 704 మందికి కరోనా…!

June 30, 2020 at 12:22 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా కట్టడి కావడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. పరిక్షలు ఎక్కువగా చేస్తే కరోనా కేసులు కట్టడి అవుతాయి అని భావించినా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. గత గత 24 గంటల్లో మరోసారి 700 మార్క్ దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీలో 704 మందికి కరోనా సోకింది అని ఏపీ ప్రభుత్వ ప్రకటించింది.

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకగా ఎపీకి చెందిన వారికి 648 మందికి కరోనా సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 5 మందికి కరోనా సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 18 వేల 114 మందికి కరోనా పరిక్షలు చేయగా ఇప్పటి వరకు 8 లక్షల 90 వేల మందికి ఏపీలో కరోనా పరిక్షలు చేసారు. ఇక యాక్టివ్ కేసుల విషయానికి వస్తే 7897 ఉన్నాయి.

 

గత 24 గంటల్లో ఏడుగురు కరోనా కారణంగా మరణించారు అని ఏపీ సర్కార్ వెల్లడించింది. మొత్తం 187 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 14 వేల 595 కి చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య చూస్తే 6161 గా ఉందని ఏపీ సర్కార్ పేర్కొంది. చిత్తూరు లో అత్యధికంగా 107 మంది మరణించారు.

ఏపీలో మరోసారి 704 మందికి కరోనా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts