ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఒక్క రోజులోనే 706 పాజిటివ్ కేసులు..!!

June 29, 2020 at 1:56 pm

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు విస్త‌రించింది. ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మ‌రెంద‌రో ఈ వ్యాధి సోకి.. నానా తంటాలు ప‌డుతున్నారు. వ్యాక్సిన్ లేని క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

గత 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించగా మరో 706 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య ‌11,554కు చేరుకుంది. అలాగే నిన్న ఒక్క‌రోజే మ‌రో 11 మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. ఈ మరణాల్లో అత్యధికంగా కర్నూలులో ఐదుగురు ఉన్నారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు.

ఫ‌లితంగా రాష్ట్రంలో మ‌ర‌ణాల సంఖ్య 180కి చేరాయి. అలాగే గ‌త 24 గంటల్లో 302 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,387 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 4,987 మంది డిశ్చార్జ్ అయ్యారు. మ‌రియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 81 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలిసింది.

ఏపీలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఒక్క రోజులోనే 706 పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts