క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఏపీలో కొత్త‌గా మరో 82 పాజిటివ్ కేసులు..!!

June 2, 2020 at 11:55 am

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ఈ పేరు వింటేనే వ‌ణికిపోతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మ‌రియు ఎంద‌రినో హాస్ప‌ట‌ల్ బారిన ప‌డేలా చేసింది. ఇక ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి.

గత 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా మరో 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటెన్ ప్రకటించింది. ఇతర కేసులు 33 ఉన్నాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,200 కి చేరింది. ఇదే స‌మ‌యంలో క‌రోనా నుంచి కోలుకుని 40 మంది డిశ్చార్జి అయినట్లు తాజా బులెటెన్‌ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల్లో 2,209 మంది డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 927 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 64కి చేరింది.

అయితే గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ప్ర‌స్తుతం ఏపీలో ఐదో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా.. క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మ‌రింత ఎక్క‌వు అవుతోంది.

క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఏపీలో కొత్త‌గా మరో 82 పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts