భార‌త్‌లో మ‌ళ్లీ క‌రోనా రికార్డు.. ఒక్క రోజులోనే అన్ని కేసులా..?

June 5, 2020 at 10:11 am

క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. క‌రోనా ఎప్పుడు అంతం అవుతుందో అని ప్ర‌పంచ‌దేవాలు వెయ్యి క‌ళ్లతో చూస్తున్నాయి. కానీ, క‌రోనా మాత్రం రోజురోజుకు వేల మందిని బ‌లితీసుకుంటూ.. విశ్వ‌రూపం చూపిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు క‌రోనా అంటే భ‌య‌ప‌డిపోతున్నారు. మ‌రోవైపు భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు డేంజ‌ర్ బెల్స్ మొగిస్తోంది.

ఇక భారత్‌లో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,851 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య ఏకంగా 2,26,770 కి చేరింది.

అలాగే ఇదే స‌మ‌యంలో క‌రోనా కాటుకు 273 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 6348 కి చేరుకుంది. ఇక ప్ర‌స్తుతం 1,10,960 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అయితే భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకూ భారత్‌లో 1,09,462 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం పేర్కొంది.

భార‌త్‌లో మ‌ళ్లీ క‌రోనా రికార్డు.. ఒక్క రోజులోనే అన్ని కేసులా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts