భార‌త్‌లో క‌రోనా విజృంభణ..ఐదున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు..!!

June 29, 2020 at 10:27 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా భూతం.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుని ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌దేశాలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయిన‌ప్ప‌టికీ త‌గిన ఫ‌లితం ద‌క్క‌డం లేదు.. క‌రోనా జోరూ ఆగ‌డం లేదు. ఇక భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

మ‌రియు క‌రోనా మ‌ర‌ణాలు కూడా అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. తాజా లెక్క‌ల‌తో ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏకంగా 380 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,475కి పెరిగింది.

ఇక ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అలాగే గత 24 గంటల్లో ఇండియాలో 12,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,21,722గా ఉంది. ఇక జూన్‌ 28 వరకు దేశంలో మొత్తం 83,98,362 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

భార‌త్‌లో క‌రోనా విజృంభణ..ఐదున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts