భార‌త్‌లో క‌రోనా కొత్త రికార్డులు.. ఒక్క రోజులోనే 8392 కొత్త కేస‌లు..!!

June 1, 2020 at 10:07 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైరస్‌ ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌రోనా భూతాన్ని వ‌దిలించుకోవ‌డానికి దేశ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు త‌గ్గ‌డం లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అనాతి కాలంలోనే దేశ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లోనూ క‌రోనా కేస‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8392 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 1,90,535కి చేరుకుంది. ఇదే స‌మ‌యంలో 230 మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5394కి చేరుకుంది. అయితే ప్ర‌స్తుతం 93,322 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాగే ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 91,818కు చేరింది. ఇక ప్ర‌స్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఎక్కువ మరణాలు ఉన్న దేశాల్లో 13వ స్థానంలో ఉంది. ఇలా ఏ రకంగా చూసినా భార‌త్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రోవైపు ఆర్థికంగా కూడా ఇండియా చాలా నష్టపోయింది.

భార‌త్‌లో క‌రోనా కొత్త రికార్డులు.. ఒక్క రోజులోనే 8392 కొత్త కేస‌లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts