ఆగ‌ని క‌రోనా జోరు.. ఒక్క రోజులోనే 1.58 ల‌క్ష‌ల పాజిటివ్‌ కేసులు..!!

June 29, 2020 at 8:22 am

ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల ప్రాణాలు బ‌లైపోతున్నాయి. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి.. నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు. ఇక గ‌త 24 గంట‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 158087 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటి… 10233202కి చేరింది.

అలాగే నిన్న ఒక్క‌రోజే 3393 మంది క‌రోనా కార‌ణంగా మృతిచెంద‌డంతో… ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 504017కి పెరిగింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రికవరీ కేసుల సంఖ్య 5546909కి చేరుకుంది. అందువల్ల ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 4182276గా ఉంది. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది.

ప్ర‌స్తుతం అమెరికాలో క‌రోనా కేసుల సంఖ్య 2635544 ఉండ‌గా.. మరణాల సంఖ్య 128432కి చేరింది. ఇక అటు బ్రెజిల్‌లో క‌రోనా కేసుల సంఖ్య 1344143 ఉండ‌గా.. మరణాల సంఖ్య 57622కి పెరిగింది. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికవరీ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. అలాగే మొత్తం యాక్టివ్ కేసుల్లో ఒక్క శాతం మందికి అంటే… 57955 మందికి కరోనా తీవ్రంగా ఉంది. రెండు నెలల కిందటి వరకూ ఈ సంఖ్య 3 శాతం దాకా ఉండేది. క్రమంగా ఇది తగ్గుతోంది.

ఆగ‌ని క‌రోనా జోరు.. ఒక్క రోజులోనే 1.58 ల‌క్ష‌ల పాజిటివ్‌ కేసులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts