మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి.. వైర‌ల్ వీడియో..!!

June 26, 2020 at 3:53 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా వైర‌స్ అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెంది.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌పంచ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేదు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ క‌రోనా కాలంలో మాస్కు ఓ కవచంలా వైరస్ సోకకుండా కాపాడుతుందని.. అందుకే అంద‌రూ మాస్కు ధ‌రించాల‌ని ప్రచారం చేస్తున్నారు. కానీ, కొంద‌రు మాత్రం మాస్క్ ధ‌రించ‌కుండా.. క‌రోనాకు ఎదురెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే మాస్కు ధ‌రించాల‌ని రెండు గ్రాఫిక్స్ సంస్థలు వినూత్నంగా ప్రచారం చేశాయి.

ఇందులో భాగంగా.. బాహుబలి చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి, భల్లాలదేవుడు ఫైటింగ్ సీన్లో మాస్కులు ధరించి పోరాడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అని, మీరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఆ గ్రాఫిక్స్ వీడియోలో సూచింది. ఈ వీడియో ప్రయత్నాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ట్విట్టర్ లో అభినందించారు. అవిటూన్ ఇండియా, కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్ లు మంచి ప్రయత్నం చేశాయని ప్ర‌శంస‌లు కురిపించారు.

మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి.. వైర‌ల్ వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts