హైదరాబాద్ కి విదేశాల నుంచి వైద్యులు రావాలా…?

June 30, 2020 at 12:40 pm

హైదరాబాద్ లో ఆస్పత్రులపై భారం భారీగా పడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. హైదరాబాద్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న నేపధ్యంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముందు కరోనా కట్టడిలో హైదరాబాద్ అన్ని నగరాల కంటే సమర్ధవంతంగా వ్యవహరించింది. కాని ఒక్కసారిగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడం చూసి చాలా మంది షాక్ అయ్యారు.

 

ఈ స్థాయిలో కేసులు పెరుగుతాయి అని ఎవరూ కూడా ఊహించలేదు. ప్రతీ రోజు కూడా 800 పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో వైద్య సదుపాయాలు అన్నీ కూడా సమర్ధవంతంగానే ఉన్నా సరే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.

 

కరోనా రోగుల భారాన్ని ఆస్పత్రులు మోయలేవు అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు హైదరాబాద్ తీవ్రతకు సంబంధించి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. తీవ్రత ఇంకా ఇంకా పెరిగితే వైద్యులు కూడా సరిపోయే అవకాశం లేదు అని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక లాక్ డౌన్ నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిది అంటున్నారు.

హైదరాబాద్ కి విదేశాల నుంచి వైద్యులు రావాలా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts