కుర్నూల్లో మరో ఘోరోం ..ఊరికి అరిష్టమని గర్భిణీ మృతిదేహాని చెట్టుకు కట్టేసి!

June 29, 2020 at 11:45 am

స‌మాజంలో మానవత్వం మంటగలిసింది అన‌డానాకి ఇప్పుడు చెప్పుకోబోయే సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌. తాజాగా కర్నూలు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసింది. డెలివరీకి వెళ్లి బిడ్డను కనకుండానే ఓ గ‌ర్భిణి మృతి చెందింది. అయితే అరిష్టం పేరుతో కొందరు గ్రామస్తులు ఓ మహిళ మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు. అంత్యక్రియలను నిర్వహించకుండా అడ్డుపడ్డారు. మృతదేహాన్ని ఊరికి దూరంగా నల్లమల అడవుల్లో ఓ చెట్టుకు కట్టేసి చేతులు దులుపుకొన్నారు.

కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నా వినిపించుకోలేదా గ్రామస్తులు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యకు నొప్పులు రావ‌డంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఇబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రసవించకుండానే ఆమె కన్నుమూసింది.

దీంతో అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి మృతదేహాన్ని శనివారం బి.నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అయితే గ్రామ‌స్తులు గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమని అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబసభ్యులు లావణ్య మృతదేహాన్ని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వచ్చారు. అయితే అడవిలో దారి పొడవునా పూలు చల్లి ఉండటంతో గుర్తించిన కూలీలు… ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ అమానుష ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

కుర్నూల్లో మరో ఘోరోం ..ఊరికి అరిష్టమని గర్భిణీ మృతిదేహాని చెట్టుకు కట్టేసి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts