హైదరాబాద్ లో భయపడుతున్న పోలీసులు…!

June 13, 2020 at 12:16 pm

హైదరాబాద్ లో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలు ఏమీ కూడా పెద్దగా ఫలించడం లేదు అనే చెప్పాలి. చాలా వరకు హైదరాబాద్ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. కరోనా కట్టడికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్గాలు వెతుకుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితే ఆందోళనగా ఉంది.

 

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. కరోనా ఇప్పుడు అక్కడ ఎక్కువగా పోలీసులను బాగా ఇబ్బంది పెడుతుంది. కరోనా కట్టడిలో కీలకంగా వ్యవహరించే పోలీసులు దాని బారిన పడటమే భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక్క బంజారా హిల్స్ పరిధిలోనే పోలీసులకు 15 మందికి కరోనా వచ్చింది. దీనితో పోలీసులు కూడా భయపడుతున్నారు.

 

నిన్న ఒక్క రోజే అక్కడ 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 174 కి చేరుకుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఇప్పుడు హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

హైదరాబాద్ లో భయపడుతున్న పోలీసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts