ఎక్స్ రే చూసి కరోనా నిర్ధార‌ణ‌.. ఎలాగంటే..?

June 30, 2020 at 9:56 am

ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో మొదలై క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించిన కరోనా వైరస్.. ఇప్ప‌టికే ఐదు ల‌క్ష‌ల‌కు పైగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మ‌రోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య కోడి దాటేసింది. ఈ లెక్క‌లు చూస్తేనే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ప్ర‌స్తుతం క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు మ‌రింత పెరిగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తెగ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌డ పెడితే.. ఈ ప్రాణాంత‌క వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకే రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో క‌రోనా కేసులు మ‌రిన్ని పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో గాంధీనగర్ ఐఐటీ విద్యార్థులు ఓ వినూత్న కంప్యూటర్ ప్రోగ్రామ్ ను తయారు చేశారు.

ఈ ప‌రిక‌రం ద్వారా ఛాతీ ఎక్స్ రేను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డీప్ లెర్నింగ్ టూల్ కు అనుసంధానం చేసి, శరీరంలో కరోనా వైరస్ జాడలను పసిగట్టవచ్చ‌ట‌. ఇందుకోసం విద్యార్థులు ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. ఎక్స్ రే చిత్రాలను పరిశీలిస్తే, కరోనా జాడను కనుగొనవచ్చని, మెదడులో 12 పొరల్లో ఉండే నాడీ వ్యవస్థ ఆధారంగా ఇది పని చేస్తుంద‌ట‌. ఈ మేర‌కు రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించిన ఎంటెక్ విద్యార్థి కుష్ పాల్ సింగ్ యాదవ్ వెల్లడించారు. మ‌రియు ఈ ప‌రిక‌రాన్ని అంద‌రికీ అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఎక్స్ రే చూసి కరోనా నిర్ధార‌ణ‌.. ఎలాగంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts