గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం… కరోనా కన్నా ప్రమాదకరం…!

June 22, 2020 at 12:44 pm

తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో అక్కడి ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన వారిని కూడా కనీసం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఒకరు మరణిస్తే మరొకరి పేరు చెప్పడం, మరణించిన వారి కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి.

ఇక ఆరు మృతదేహాలు అక్కడ కనపడటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిని ఎక్కడో పడేస్తున్నారు అంటూ పలు మృతదేహాల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి ఈ ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణాలో గాంధీ ఆస్పత్రిలోనే ఎక్కువగా కరోనా చికిత్సలు చేస్తున్నారు వైద్యులు. ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

దీనిపై కొందరు హైకోర్ట్ కి కూడా వెళ్ళారు. ప్రభుత్వం గాంధీ ఆస్పత్రికి వెళ్ళాలి అని చెప్తుందని కాని తాము గాంధీ ఆస్పత్రికి వెళ్ళినా సరే ఫలితం ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో కూడా తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. దబీర్ పురా కు చెందినా ఒక మహిళ మరణిస్తే పాత బస్తీ లో ఉన్న మరో మహిళ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం… కరోనా కన్నా ప్రమాదకరం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts