ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరయ్యే స్తోమత లేక బాలిక మనస్తాపం.. చివ‌ర‌కు దారుణంగా..

June 2, 2020 at 4:09 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌మ‌హ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా దేశ‌దేశాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఇక వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే పాఠశాలలను కూడా మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నాయి.

అయితే ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పూట గడవడానికే ఇబ్బందులు పడే పేద విద్యార్థులు ఆన్‌లౌన్‌ క్లాసుల సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ బాలిక ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరయ్యే స్తోమత లేక మ‌న‌స్తాపం గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కేరళలో ఓ బాలిక‌(14) ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నానన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అనంతరం వాలంచెరిలోని ఇంటి సమీపంలో ఆమె విగతజీవిగా కనపడింది. ఆమె మృతదేహం పక్కనే కిరోసిన్ సీసా‌ కూడా ఉంది. పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్థానిక పాఠశాలలో 9 వ తరగతి చదువుతోందని తెలిపారు. తరగతిలో ఆ విద్యార్థిని ఎ‍ప్పుడూ ఫస్ట్‌ వచ్చేదని చెప్పారు. ఇక స‌ద‌రు బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. కుటుంబ‌స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగారు. కాగా, ఆ బాలిక మరణం తనను కలచి వేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరయ్యే స్తోమత లేక బాలిక మనస్తాపం.. చివ‌ర‌కు దారుణంగా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts