బ్రేకింగ్:సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్…!

June 8, 2020 at 5:35 pm

ఇప్పుడు సినిమాల షూటింగ్ ల కోసం సిని జనాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. సినిమాల షూటింగ్ లేకపోతే మాత్రం చాలా మంది రోడ్డున పడే అవకాశం అనేది ఉంటుంది. దీనితో సినీ పెద్దలు ఇప్పుడు తెలంగాణాలో సినిమాల షూటింగ్ ల కోసం గానూ అక్కడి ప్రభుత్వాన్ని ఇటీవల సంప్రదించిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి అనుమతులు ఇస్తామని చెప్పారు.

 

జూన్ లో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తామన్న కేసీఆర్ సర్కార్ మాట నిలబెట్టుకుంది. తెలంగాణలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించడానికి ఆయన అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన కేసీఆర్ సంతకం కూడా చేసారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని ఆయన ఆదేశాల్లో స్పష్టంగా పెరోన్నారు.

 

షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే సమయంలో థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉందని అందకే సినిమా హాల్ ని అనుమతి ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

బ్రేకింగ్:సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts