డైరెక్టర్ తో హీరో లిప్ లాక్ …షాక్ లో టాలీవుడ్ !

June 26, 2020 at 3:50 pm

ఈ మధ్య రోజులు రోజులు మారాయని కొందరు పదే పదే అంటుంటే హా ఏమి మారాయిలే స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది అంతే గా అంటున్నారు కొందరు. కాని కొన్ని కొన్ని చూసిన తర్వాత మారడం… ఆహా ఇలా కూడా ఉంటుందా అనే విధంగా ఉంటుంది. జనాలు సంబరాలు చేసుకునే విధానం, జనాలు ఒకరిని ఒకరు అభినంధించుకునే విధానం కాస్త విడ్డూరంగా ఉంది. అసలు ఏంటి కథ అంటే…

తాజాగా ఒక తెలుగు దర్శకుడు హీరో లిప్ లాక్ ఇచ్చుకున్నారు. హా అవును… అదేంటి అంటారా..? హా అవును అదే… స్క్రీన్ పై లిప్ లాక్ లు మనం చూసాం కదూ ఇప్పటి వరకు. కాని ఆఫ్ స్క్రీన్ లిప్ లాక్ కూడా చూపించారు ఆ ఇద్దరు. ఎవరా ఇద్దరు అని అంటారా…? నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మధ్య `కృష్ణ అండ్ హిస్ లీల‌` సినిమా విడుద‌లై కాస్త పర్వాలేదు అనిపించుకుంది. అదే పది వేలు అనుకుంది ఆ సినిమా యూనిట్.

ఇక సోషల్ మీడియాలో దర్శకుడు హీరో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ఆనందాన్ని కాస్త పట్టలేక… షేక్ హాండ్ ఇచ్చుకోవాల్సింది పోయి లిప్ లాక్ ఇచ్చుకున్నారు గురూ… కరణ్ జోహార్ అభిషేక్, జాన్ అబ్రహం సినిమాలో ఇచ్చుకున్నారు గాని వీళ్ళు ఇద్దరూ రియల్ గానే ఇచ్చుకున్నారు మరి. పెట్టుకుంటే పెట్టుకున్నారు గాని ఆ సినిమా పేరు కూడా తెలియని జనాలు నెట్ ఫ్లిక్స్ కోసం తెలిసిన వాళ్ళను లాగిన్స్ అడిగారు మరి.

డైరెక్టర్ తో హీరో లిప్ లాక్ …షాక్ లో టాలీవుడ్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts