దేశంలో ఎన్ని సెకన్లకు ఒక కేసు అంటే…!

June 1, 2020 at 11:44 am

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కట్టడి కోసం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం ఉండటం ఉండటం లేదు. ఇక గంట గంటకు రోజుకి కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పెరుగుతూనే ఉన్నాయి అత్యంత వేగంగా… ఇక మన దేశంలో గత 24 గంటల్లో 8700 కేసులకు పైగా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక మరణాలు కూడా 230 వరకు ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే 24 గంటల్లో గంటకు ఎన్ని కేసుల చొప్పున నమోదు అయ్యాయి అనేది చూస్తే 365 కేసులు నమోదు అయ్యాయి. నిమిషానికి ఆరు కేసులు అంటే పది సెకన్లకు ఒక కేసు నమోదు అయింది. గంటకు 9 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రల్లో 70 వేల కేసులు వరకు వెళ్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కరోనా రాజధానిగా మారుతుంది.

కరోనా కట్టడిలో ఎన్ని చర్యలు తీసుకున్నా మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. వేల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఆందోళనకరంగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం గుజరాత్, తమిళనాడు. యాక్టివ్ కేసులు లక్ష దిశగా వెళ్తున్నాయి. ఇక పాజిటివ్ కేసులు మొత్తం 2 లక్షల వరకు వెళ్తున్నాయి. మరణాలు కూడా వేగంగా నమోదు అవుతున్నాయి.

దేశంలో ఎన్ని సెకన్లకు ఒక కేసు అంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts