చైనా విషయంలో మోడీ జాగ్రత్త పడుతున్నారా…? సర్జికల్ దాడులు అందుకే చేయలేదా…?

June 30, 2020 at 10:43 am

దేశ వ్యాప్తంగా ఇప్పుడు చైనా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చైనా సరిహద్దుల్లో చేస్తున్న పనులపై ఇప్పుడు భారతీయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత నెల రోజుల నుంచి కూడా సరిహద్దుల్లో చైనా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని విధాలుగా చైనాను కట్టడి చెయ్యాలి అని చూసినా సరే చైనా మాత్రం తన పని తాను చేస్తుంది. ఇక భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

 

చైనాకు చెందిన 59 కీలక యాప్స్ పై డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని చెప్పి దేశ వ్యాప్తంగా వాటిని బాన్ చేసింది. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు సోషల్ మీడియాలో కేంద్రంపై పలువురు కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనాను ఎదుర్కోలేక కేవలం యాప్స్ పై బాన్ వేసింది అంటున్నారు. అదే పాకిస్తాన్ సైనికులు వస్తే వారి మీద సర్జికల్ దాడులు చేసి ఉండే వారు అని అంటున్నారు.

 

పాకిస్థాన్ మీద ప్రదర్శించిన దూకుడు చైనా మీద ప్రదర్శించడం లేదని అంటున్నారు. ఇక చైనాతో మనకు అవసరం ఎక్కువగా ఉంటుందనే కేంద్రం కేవలం యాప్స్ తో మాత్రమే సరిపెట్టి ఉంటుంది అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక చైనా విషయంలో మోడీ కాస్త దాటవేత ధోరణి లో ఉన్నారు అని పాకిస్తాన్ మీద చూపించిన దూకుడు ఆయనకు చైనా విషయంలో కనపడటం లేదని అంటున్నారు.

 

బీహార్ ఎన్నికల కోసమే ఈ విధంగా మోడీ సర్కార్ యాప్స్ ని నిషేధించింది అని పలువురు అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం బిజెపి చేస్తుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చైనా వ్యతిరేక పవనాలను ఈ విధంగా బిజెపి క్యాష్ చేసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామం మాత్రం ఆసక్తికరంగా మారింది.

చైనా విషయంలో మోడీ జాగ్రత్త పడుతున్నారా…? సర్జికల్ దాడులు అందుకే చేయలేదా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts