గుంటూరు జిల్లా విషయంలో తర్జన భర్జనలో సిఎం జగన్…?

June 30, 2020 at 4:45 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఎవరికి కేబినేట్ లో చోటు దక్కే అవకాశం ఉంది అనే దాని మీద అనేక వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి గోదావరి జిల్లాల నుంచి ఎవరికి అవకాశం ఇవ్వొచ్చు అనే దాని మీద పార్టీ అధిష్టానం కూడా అనేక చర్చలు జరుపుతూ వస్తుంది. ఇక కీలక నేతలు మంత్రులు కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 

గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు మంత్రి పదవుల కోసం ఆసక్తిగా ఉన్నారు. విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇద్దరూ కూడా తమకు ఉన్న మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ సిఎం జగన్ కు అత్యంత సన్నిహితులే. విడదల రజని టీడీపీ సీనియర్ నేతను ఓడించి తన సత్తా చాటారు. ఇక పిన్నెల్లి విషయానికి మాచర్లలో ఆయనకు తిరుగు లేదు. కాంగ్రెస్ నుంచి జగన్ వెంట నడిచారు.

 

దీనితో ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మంత్రి పదవి అవకాశాలు ఇద్దరికీ ఉన్నా సరే పిన్నెల్లి సీనియర్ కావడం, బలమైన నేత కావడంతో ఆయనకే రావొచ్చు అంటున్నారు. ఇక బీసీ నేత గా బలమైన గుర్తింపు ఉండటం విడదల రజినీ కి కలిసి వచ్చే అంశం. ఇద్దరూ ఆర్ధికంగా బలమైన నేతలే.

గుంటూరు జిల్లా విషయంలో తర్జన భర్జనలో సిఎం జగన్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts