విజయసాయితో జగన్ కీలక భేటి…!

June 2, 2020 at 3:31 pm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మంత్రులు, ఎంపీ విజయసాయి రెడ్డి సమావేశం అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొనసాగుతున్న భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

దాదాపు రెండు గంటల నుంచి జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలక౦గా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం కొడాలి నాని లేదా విజయసాయి మీడియా మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

 

జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకు రద్దు అయింది అనేది స్పష్టత రావడం లేదు. అపాయింట్మెంట్ కోరినా సరే కేంద్రం నుంచి రాలేదు అని అంటున్నారు. అదే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తప్పించిన విషయంలో సుప్రీం కోర్ట్ స్టే ఇస్తే ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద ఇప్పుడు ఏపీ సర్కార్ కసరత్తులు చేస్తుంది. స్టే ఇస్తే మాత్రం మరో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ అనే మాజీ అధికారిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

విజయసాయితో జగన్ కీలక భేటి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts