ఖ‌ద్ద‌ర్ తొడిగిన తార‌క్‌…రియ‌ల్ నాయ‌కుడు

June 20, 2020 at 10:22 pm

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో అర‌వింద స‌మేత బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ కాంబినేష‌న్ రిపీట‌వుతోంది అన‌గానే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. రాజమౌళితో RRR పూర్తి కాగానే ఈ కాంబినేష‌న్ సినిమా సెట్స్ కెళ్ల‌నుంది. అలాగే త్రివిక్రమ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బస్టర్ అల వైకుంఠ‌పురములో తర్వాత తార‌క్ తో సినిమా చేయ‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కార‌ణం ఏదైనా.. నందమూరి అభిమానులు ఈ కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ కూడా బ్లాక్ బస్టర్ కాబట్టి అంత‌కుమించిన సంచ‌ల‌నం సాధ్య‌మేన‌ని అభిమానుల్లో అంచ‌నాలేర్ప‌డ్డాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఎన్టీఆర్ న‌టించ‌నున్న తాజా చిత్రం ఓ పొలిటిక‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఇంకా ఈ మూవీకి టైటిల్ ని నిర్ణ‌యించ‌లేదు. తాజాగా ఎన్టీఆర్ లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు. తెలుపు ఖద్దర్ దుస్తులలో ఫ‌స్ట్ లుక్ టెస్ట్ కానిచ్చేశారు. కోవిడ్ మార్గదర్శకాల కారణంగా ప‌రిమిత సంఖ్య‌లో సిబ్బంధితో ఈ టెస్ట్ షూట్ ని పూర్తి చేశార‌ట త్రివిక్ర‌మ్. తాజాగా తార‌క్ లుక్ పై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. నాయ‌కుడిగా త‌మ అభిమాన హీరో ఎలా ఉంటాడో చూడాల‌న్న ఆస‌క్తి మొద‌లైంది.

ఖ‌ద్ద‌ర్ తొడిగిన తార‌క్‌…రియ‌ల్ నాయ‌కుడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts