సర్కారు వారి పాటలో సాలిడ్ విలన్..?

June 12, 2020 at 8:47 am

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. కాగా ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమా వసూళ్ల పరంగానూ భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు మహేష్. గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తన 27వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. మహేష్ ప్రీలుక్ పోస్టర్ చాలా స్టైలిష్‌గా ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా, అసలు ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారా అనే టాక్ ప్రేక్షకుల్లో మొదలైంది.

ఇక ఈ సినిమాలో మహేష్‌ను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ నటుడు కిచ్చ సుదీప్‌ను చిత్ర యూనిట్ తీసుకోవాలని చూస్తోంది. స్టైలిష్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచే ఈ యాక్టర్ అయితే మహేష్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని చితర యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ సినిమాలోని విలన్ పాత్రలో ఆయన్ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో నటించేందుకు సుదీప్ ఒప్పుకుంటే మాత్రం ఈ హీరో-విలన్‌లు ఎలాంటి పర్ఫార్మెన్స్‌లతో అదరగొడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సర్కారు వారి పాటలో సాలిడ్ విలన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts