షాకింగ్ న్యూస్‌: కొండపోచమ్మ జలాశయానికి గండి.. గ్రామాన్ని ముంచెత్తిన నీరు..!!

June 30, 2020 at 10:13 am

కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా ఇటీవ‌ల నీరు విడుదలైన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని ఎఫ్‌ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునిత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందకున్నారు.

కొండపోచమ్మ కాల్వకు గండి

అయితే తాజాగా కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు ఈ ఉదయం గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంట పొలాలు, కూరగాయల తోటలు పూర్తిగా మునిగిపోయాయి.

కొండపోచమ్మ కాల్వకు గండి

ఇక సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. కాగా, ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

షాకింగ్ న్యూస్‌: కొండపోచమ్మ జలాశయానికి గండి.. గ్రామాన్ని ముంచెత్తిన నీరు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts