కూతురుతో మ‌హేష్ `టంగ్ – ట్విస్టర్`.. వైర‌ల్ వీడియో..!!

June 23, 2020 at 3:21 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల ముందు సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న‌ హీరోగా రూపొందనున్న చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ప్రీ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా మహేష్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్ర‌మంలోనే కొడుకు గౌత‌మ్‌, కుమార్తె సితార‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మ‌హేష్‌.

ఇక తాజాగా మహేశ్ బాబు తన కూతురు సితారతో సోఫాపై కూర్చొని ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య నమ్రత పోస్ట్ చేసింది. ‘ఓడిపోయావ్’ అంటూ‌ తండ్రితో సితార వాదించింది. పలు పదాలు పలకలేక ఇద్దరూ కష్టపడ్డారు. ఆ సమయంలో ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.

కూతురుతో మ‌హేష్ `టంగ్ – ట్విస్టర్`.. వైర‌ల్ వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts