మ‌హేష్‌కు జోడీగా మ‌హాన‌టి.. ఇక బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే..?

June 18, 2020 at 10:19 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ డబుల్ ట్రీట్ అన్నట్లుగా టైటిల్‌తో పాటు ప్రీలుక్‌ను కూడా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున విడుదల చేశారు.

ఈ టైటిల్‌కు, ప్రీలుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే అప్ప‌టి నుంచి ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్ర‌మంలోనే మహేష్ తో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, కియారా అద్వానీ ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మరో రెండేళ్లవరకు తన క్యాలండర్లో ఖాళీ లేదని కియారా స్పష్టం చేసిందట. దీంతో చిత్ర యూనిట్ మ‌ళ్లీ హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించింది.

అయితే గ‌త కొన్నాళ్లుగా జరుగుతున్న కసరత్తు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా మహాటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు సమాచారం. అలాగే మహేశ్ కూడా కీర్తికే మొగ్గు చూపడంతో ఆమె కూడా ఓకే చెప్పింద‌ట‌. అలాగే వీరు కోరిన సమయాలలో కావలసిన డేట్స్ ను కూడా ఈ ముద్దుగుమ్మ కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు స‌మాచారం. ఇక మ‌హేష్ స‌ర‌స‌న మొద‌టిసారి కీర్తి న‌టించ‌బోతుండ‌డంతో.. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌రే అంటున్నారు ఫ్యాన్స్‌.

మ‌హేష్‌కు జోడీగా మ‌హాన‌టి.. ఇక బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts