తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం.. అసెంబ్లీలో బాల‌య్య డైలాగ్

June 19, 2020 at 12:51 pm

నేడు దేశంలోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇటు ఏపీలోనూ నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

టీడీపీ నుంచి నందమూరి బాలయ్య తొలి ఓటు వేశారు. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. బాలయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో పక్కనే ఓ కుక్క మొరిగింది.. వెంటనే ఆయన వ్యంగ్యంగా స్పందించారు. కుక్క అరుస్తోంది ఎందుకో.. ఎవరికి ఎలా అర్ధమవుతుందో వారికి అదే భాషలో చెప్పాలన్నారు.. తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం అంటూ డైలాగ్ చెప్పారు.

దీంతో పక్కనే ఉన్నవారు గ‌ట్టిగా న‌వ్వేశారు. ఈ సీన్ ఆసక్తికరంగా మారింది. అయితే అదే స‌మ‌యంలో బాల‌య్య డైలాగ్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కేవలం కుక్క అరవడంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? ల‌దా మరేదైనా ఉద్దేశ్యంతో ఇలా అన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం.. అసెంబ్లీలో బాల‌య్య డైలాగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts